విజ్ఞాన కేంద్రాలు.. ప్రభుత ్వ పాఠశాలలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:35 AM
ప్రభుత్వ బడిలో విద్యాభ్యాసం అంటే అదృష్టమని అనుకునేలా సర్కారీ స్కూళ ్లను తీర్చిదిద్దుతామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
అదృష్టంగా భావించేలా స్కూళ్లను తీర్చిదిద్దుతాం: భట్టి
మధిర, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడిలో విద్యాభ్యాసం అంటే అదృష్టమని అనుకునేలా సర్కారీ స్కూళ ్లను తీర్చిదిద్దుతామని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం జరిగిన టీవీఎం ప్రభుత్వ పాఠశాల 48వ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై తమ సర్కారు దృష్టి సారించిందన్నారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచంతో పోటీ పడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ బడులంటే కేవలం భవనాలే కాదని, అవి విజ్ఞాన కేంద్రాలని భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్‌లో విద్యకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల 48వ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సావనీర్‌ను ఆయన విడుదల చేశారు.