రైతుల ఖాతాల్లోకి 1,129 కోట్లు
ABN , Publish Date - May 04 , 2026 | 04:08 AM
ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,129 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరా లశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు..
హైదరాబాద్, మే 3(ఆంధ్రజ్యోతి): ఈ యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,129 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరా లశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1.54 లక్షల మంది రైతుల నుంచి మొత్తం 12.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.