Share News

గ్రామాలు, మండలాల్లో చలివేంద్రాలు: సీతక్క

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:57 AM

వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామాలు, మండల కేంద్రాల్లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ...

గ్రామాలు, మండలాల్లో చలివేంద్రాలు: సీతక్క

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామాలు, మండల కేంద్రాల్లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ములుగు నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు అన్నిగ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు చేయడంతో ప్రజలు ఈ సౌకర్యాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. వేసవి కాలంలో సాధారణ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ముఖ్యంగా బస్టాండ్‌, మార్కెట్‌, ప్రధాన రహదారుల వద్ద చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.

Updated Date - Apr 13 , 2026 | 05:57 AM