Share News

‘రైతు భరోసా’కు నిధులను సమీకరిస్తున్న ప్రభుత్వం..

ABN , Publish Date - Feb 08 , 2026 | 07:08 AM

యాసంగి సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ నిధుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు బహిరంగ మార్కెట్‌ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది..

‘రైతు భరోసా’కు నిధులను సమీకరిస్తున్న ప్రభుత్వం..

  • రూ.9వేల కోట్ల రుణానికి ఆర్బీఐకి ఇండెంటు

  • 10న సర్కారు ఖాతాలోకి నిధుల జమ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ నిధుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు బహిరంగ మా ర్కెట్‌ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకోనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రూ.9వేల కోట్ల రుణం కోసం ఇండెంటు పెట్టింది. ఇందులో.. 13 ఏళ్ల కాల పరిమితితో రూ.2వేల కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో రూ.2వేల కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో రూ.2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో రూ.2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకోనుంది. ఈ నెల 10న ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. ఆ తదుపరి రైతుల ఖాతాలకు సొమ్మును బదిలీ చేసే అవకాశముంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్‌ నుంచి ప్రభుత్వం ఎప్పుడూ రుణాలను సేకరించలేదు. రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్లను పంపిణీ చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ‘ప్రజా పాలన.. ప్రగతి బాట’ కార్యక్రమంలో ప్రకటించారు. యాసంగి సీజన్‌లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సిద్ధంచేసి పెట్టింది.

Updated Date - Feb 08 , 2026 | 07:50 AM