Share News

అల్వాల్‌ టిమ్స్‌కు కొత్తగా 339 పోస్టులు

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:50 AM

హైదరాబాద్‌లోని అల్వాల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)’ ఆస్పత్రికి కొత్తగా 339 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

అల్వాల్‌ టిమ్స్‌కు కొత్తగా 339 పోస్టులు
alwaltims

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అల్వాల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)’ ఆస్పత్రికి కొత్తగా 339 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్‌ శుక్రవారం జీవో జారీ చేశారు. మంజూరైన ఈ పోస్టులను ఎయిమ్స్‌ వేతనాల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వాటిలో వైద్య, పారామెడికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌, ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ పోస్టులున్నాయి. ఇక పోస్టుల విషయానికొస్తే.. డైరెక్టర్‌ -1, ప్రొఫెసర్లు- 18, అసోసియేట్‌ ప్రొఫెసర్లు- 10, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు- 27, డిప్యూటీ రిజిస్ర్టార్‌- 1, అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌- 1, ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ (మెడికల్‌)- 1, నర్సింగ్‌ ఆఫీసర్లు- 218, సీనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్లు- 33, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు- 1, చీఫ్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌- 1, డిప్యూటీ నర్సింగ్‌ సూపరింటిండెంట్‌ (గ్రేడ్‌- 2)- 1, ఫార్మసీ ఆఫీసర్‌- 1, సీనియర్‌ ఫార్మసీ ఆఫీసర్‌- 1, నాన్‌- మెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌- 1, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌- 1, జూనియర్‌ అసిస్టెంట్లు- 6, సీనియర్‌ అసిస్టెంట్లు- 3, ఆఫీస్‌ సూపరింటెండెంట్లు- 3, అసిస్టెంట్‌ డైరెక్టర్‌- 1, స్టోర్‌ సూపర్‌వైజర్‌- 2, అకౌంట్స్‌ ఆఫీసర్లు- 2, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌- 1, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌- 1, తదితర పోస్టులున్నాయి. డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల ప్రక్రియ ప్రారంభించే ముందు సంబంధిత సర్వీసు నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 06:50 AM