ఉద్యోగ సమస్యల పరిష్కారానికి సర్కార్ పచ్చజెండా
ABN , Publish Date - May 04 , 2026 | 04:40 AM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల చిరకాల డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ఎంప్లాయీస్ ...
సీఎం రేవంత్‌రెడ్డికి టీజీఈజేఏసీ కృతజ్ఞతలు
హైదరాబాద్, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల చిరకాల డిమాండ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు టీజీఈజేఏసీ చైర్మన్ మారంజగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ జూన్ 1లోగా కొత్త ఆరోగ్య భద్రత కార్డులు అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వం ముందు ఉంచిన 63 డిమాండ్లలో ఇప్పటికే 26 డిమాండ్లను నెరవేర్చిందని, మిగిలిన 37 డిమాండ్లపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని టీజీఈజేఏసీ నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు.