Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:28 AM
రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
పెండింగ్ బిల్లులకు 713 కోట్లు విడుదల
డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారుల చర్యలు
గ్రాట్యుటీ, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన బిల్లులు క్లియర్
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.713 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థికశాఖ అధికారులు బుధవారం ఈ బిల్లులను క్లియర్ చేశారు. ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున బిల్లులను క్లియర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ నెలాఖరులో రూ.183కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం.. ఆగస్టు నుంచి ప్రతి నెలా కనిష్ఠంగా రూ.700కోట్ల మేర నిధులను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే డిసెంబరులో రూ.713కోట్లను విడుదలచేసింది. ఉద్యోగుల గ్రాట్యు టీ, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన బిల్లులు క్లియర్ అయిన వాటిలో ఉన్నాయి.