Share News

ఆర్టీసీలో 279.97 కోట్ల ఉచిత ప్రయాణాలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:38 AM

మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్‌ 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 279.97 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఆర్టీసీలో 279.97 కోట్ల ఉచిత ప్రయాణాలు

  • ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకం: మంత్రి పొన్నం

మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్‌ 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 279.97 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మండలిలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం తేవడంపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద 2024-25లో రూ.3,866.30 కోట్లు, 2025-26లో ఫిబ్రవరి 26 వరకు రూ.2,913.82 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రూ.17 కోట్లతో ఆర్టీసీ ఆస్పత్రి అభివృద్ధి, 2017కి సంబంధించిన 21 శాతం ఫిట్మెంట్‌ తదితర సంక్షేమ చర్యలు చేపట్టినట్లు వివరించారు.

Updated Date - Mar 19 , 2026 | 04:38 AM