ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభానికి కసరత్తు
ABN , Publish Date - May 19 , 2026 | 05:30 AM
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం .....
విధివిధానాలపై నేడు అత్యవసర చర్చ
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ)‘ అమలుపై కీలక అడుగు పడింది. ఈ సార్వత్రిక జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా పట్టాలెక్కించేందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయడానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ ఉప సంఘం అత్యవసరంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ అత్యవసర సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు. పథకం అమలుకు సంబంధించిన నిబంధనలపై అధికారులు, భాగస్వామ్య సంస్థలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ ఉప సంఘం సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిలు పాల్గొననున్నారు.