సర్కారీ దవాఖానాల్లో అంతర్జాతీయ వైద్య సేవలు
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:10 AM
హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది.
అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కమిటీ
హైదరాబాద్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. ఇకపై కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాల్లోనూ విదేశీయులకు వైద్యసేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై అధ్యయనం చేసి, సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.గౌతమి, నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ వివిధ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.