Share News

గిరిజన సహకార సంస్థ ఉద్యోగుల సేవల్లో సవరణలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:23 AM

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థల్లో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సేవల కొనసాగింపునకు...

గిరిజన సహకార సంస్థ ఉద్యోగుల సేవల్లో సవరణలు

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థల్లో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సేవల కొనసాగింపునకు సంబంధించి ప్రభుత్వం తాజాగా సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా విభాగాల్లో అనుమతించిన పోస్టుల సంఖ్య, జిల్లాల వారీ కేటాయింపుల్లో గతంలో దొర్లిన కొన్ని సాంకేతిక లోపాలను సవరిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్‌ జీవో ఆర్డీ నెం.1095ను విడుదల చేశారు. గిరిజన సంక్షేమశాఖ పరిపాలన నియంత్రణలోని ఆరు విభాగాల్లో మొత్తం 3,431 పోస్టులను (2,225 కాంట్రాక్ట్‌, 1,206 అవుట్‌ సోర్సింగ్‌) మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ సవరణల వల్ల ఉద్యోగుల జీతభత్యాల విడుదల, ట్రెజరీ క్లియరెన్స్‌ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. దీనిపై తదుపరి చర్యలు చేపట్టాలని గిరిజన సహకార సంస్థ ఎండీని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 23 , 2026 | 03:23 AM