Share News

నిబంధనల ప్రకారం బదిలీలు జరగట్లేదు

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:10 AM

వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర...

నిబంధనల ప్రకారం బదిలీలు జరగట్లేదు

తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆందోళన

హైదరాబాద్‌, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. బదిలీల ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా స్పౌస్‌ బదిలీలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైద్యులు సమర్పించిన రిక్వెస్ట్‌ బదిలీలను తక్షణమే మంజూరు చేయాలని, గుర్తింపు పొందిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Jun 05 , 2026 | 04:10 AM