Share News

నేడు పలు శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్ష

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:17 AM

అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తును ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే సాగునీటి పారుదల....

నేడు పలు శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమీక్ష

  • సచివాలయంలో సమీక్షించనున్న డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తును ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే సాగునీటి పారుదల, రోడ్లు-భవనాలు, రవాణా, పౌర సరఫరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం తదితర శాఖల ప్రతిపాదనలను సమీక్షించి ఒక అవగాహనకు వచ్చిన ఆర్థిక శాఖ మంగళవారం నుంచి ఇతర శాఖల సమీక్షలను ప్రారంభించనుంది. ఈ ఒక్క రోజే 20కి పైగా శాఖల ప్రతిపాదనలపై సమీక్షలు చేపట్టనుంది. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రతిపాదనలను సమీక్షించనున్నారు. మంగళవారం సచివాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమీక్ష సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఈ నెల 20న ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది.

Updated Date - Mar 10 , 2026 | 03:17 AM