Share News

ఉద్యోగుల బదిలీల జీవో నంబర్‌ 38లో లోపాలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 07:09 AM

ఉద్యోగుల బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 38లో అనేక లోపాలు ఉన్నాయని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్‌ వేముల శ్రీనివాస్‌ ఆరోపించారు.

ఉద్యోగుల బదిలీల జీవో నంబర్‌ 38లో లోపాలు

  • తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల ఫోరం ఆరోపణ

అఫ్జల్‌గంజ్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 38లో అనేక లోపాలు ఉన్నాయని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్‌ వేముల శ్రీనివాస్‌ ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల కోసం కనీస సర్వీస్‌ నిబంధన 2నుంచి 3సంవత్సరాలకు పెంచడం సరికాదన్నారు. 3సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసినవారు చాలా తక్కువగా ఉంటారని, కటాఫ్‌ తేదీని 5 ఆగస్టు 2026గా నిర్ణయించాలని కోరారు. జీవో నవంబర్‌ 38లో స్పౌజ్‌ కేసులకు కనీస సర్వీస్‌ నిబంధన నుంచి మినహాయింపు నిబంధనలలో శాస్ర్తీయత లేదన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 07:13 AM