Share News

గిగ్‌ వర్కర్ల చట్టం చరిత్రాత్మకం

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:49 AM

గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని (తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్ల బిల్లు- 2026) తీసుకురావడం చరిత్రాత్మకమని గిగ్‌క్ష ప్లాట్‌ఫాం ...

గిగ్‌ వర్కర్ల చట్టం చరిత్రాత్మకం

  • సీఎం, మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాన్ని (తెలంగాణ ప్లాట్‌ఫాం ఆధారిత గిగ్‌ వర్కర్ల బిల్లు- 2026) తీసుకురావడం చరిత్రాత్మకమని గిగ్‌క్ష ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ ప్రశంసించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామిలకు యూనియన్‌ ప్రతినిధిలు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ సలాహుద్దీన్‌ నేతృత్వంలోని బృందం ఆదివారం మంత్రి వివేక్‌ను సోమాజిగూడలోని వారి నివాసంలో కలిసి, ఈ చట్టం లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి వివేక్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలు, కార్మికుల పక్షాన నిలుస్తుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్‌ వర్కర్ల పాత్ర కీలకమని, వారి సామాజిక భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 04:49 AM