Share News

జర్మనీ సహకారంతో యువతకు ఉపాధి: వివేక్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:05 AM

తెలంగాణ జర్మనీల మధ్య సహకారం పెరగడం వల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు.

జర్మనీ సహకారంతో యువతకు ఉపాధి: వివేక్‌

  • మంత్రితో జర్మనీలోని తురింగియా రాష్ట్ర బృందం భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జర్మనీల మధ్య సహకారం పెరగడం వల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. జర్మనీలోని తురింగియా రాష్ట్ర ప్రతినిధి బృందం బుధవారం సచివాలయంలో మంత్రి వివేక్‌తో భేటీ అయింది. నైపుణ్యాభివృద్ధి, మానవవనరులు, పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక సహకారం వంటి అంశాలపై తెలంగాణ, జర్మనీల మధ్య సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. జర్మనీలో తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడానికి ‘తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ(టామ్‌కామ్‌)’ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడి యువతకు జర్మన్‌ తదితర భాషల్లో టామ్‌కామ్‌ ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. మంత్రిని కలిసిన తురింగియా ప్రతినిధి బృందంలో ఆ రాష్ట్ర సీఎం మారియో వోయ్ట్‌, కార్మికమంత్రి షెంక్‌, కార్యదర్శులు సుకర్ట్‌, డాక్టర్‌ టెయిచర్ట్‌ ఉన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 06:05 AM