ఎఫ్‌ఎస్ఎల్ డేటా రికవరీ అసాధ్యం!
ABN , Publish Date - Feb 22 , 2026 | 06:20 AM
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎ్‌సఎల్)లో ఈ నెల 7న జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైళ్ల నుంచి డేటా రికవరీ కష్టమేనని నాగపూర్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం...
1,100 కేసుల డేటా పోయినట్లే
తేల్చిచెప్పిన నాగపూర్ బృందం
హైదరాబాద్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎ్‌సఎల్)లో ఈ నెల 7న జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైళ్ల నుంచి డేటా రికవరీ కష్టమేనని నాగపూర్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది. మొత్తం 1,100 కేసులకు సంబంధించిన ఫైళ్ల డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఎఫ్‌ఎ్‌సఎల్ భవనంలోని 50 కంప్యూటర్లు, హర్డ్‌డి్‌స్కలు, సర్వర్ రూం పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఫైళ్లలోని డేటా రికవరీ సాధ్యమేనా అన్న విషయాలను తెలుసుకోవడానికి రాష్ట్ర పోలీసులు నాగపూర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ, ఇంజనీరింగ్ సంస్థల నుంచి నిపుణుల బృందాన్ని రప్పించారు. ఈ నెల 10 నుంచి ఈ నిపుణుల బృందం ఫైళ్ల రికవరీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఫోరెన్సిక్ కంప్యూటర్ ల్యాబ్ వివిధ రకాల కేసుల దర్యాప్తులో కీలకమైంది. ఆధారాలను భద్రపరిచే గదితో పాటు, విశ్లేషణ పూర్తయిన తర్వాత నివేదికలు ఉంచే గది కూడా పూర్తిగా బూడిద కావడంతో వేలాది కేసులపై దీని ప్రభావం పడేఅవకాశముంది. ఈ ప్రమాదంలో రెండో అంతస్తులోని కెమికల్ ల్యాబ్ సురక్షితంగా ఉండగా, మొదటి అంతస్తులోని కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్ పరికరాలు, సర్వర్ రూం, ప్రాపర్టీరూం దగ్ధం కావటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.