జర్నలిస్టుల అక్రెడిటేషన్ల కోసం..రాష్ట్ర మీడియా కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:31 AM
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 21మంది సభ్యులతో కూడిన..
చైర్మన్‌గా మీడియా అకాడమీ అధిపతి
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 21మంది సభ్యులతో కూడిన ‘రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎ్‌సఎంఏసీ)’ని ఏర్పాటు చేసూ సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్‌ను రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీకి చైర్మన్‌గా, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ను కో-చైర్మన్‌గా నియమించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్/జాయింట్ డైరెక్టర్ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జర్నలిస్టుల నుంచి అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి కార్డులు జారీ చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. అలాగే జిల్లాలవారీగా కలెక్టర్లు పంపే ‘జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)’ల కూర్పు ప్రతిపాదనలను కూడా ఈ కమిటీ ఆమోదం తెలపాలని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌కు సూచించారు.
21 మందితో కమిటీకి రూపం
ఈ 21మంది సభ్యుల కమిటీలో వివిధ జర్నలిస్టు సంఘాలకు, మీడియా విభాగాలకు ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించింది. టీయూడబ్ల్యూజే (హెచ్-9), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలి్‌స్ట్స(హెచ్-143), టీడబ్ల్యూజేఎఫ్, టీజేఏ(హెచ్-451) వంటి సంఘాల ప్రతినిఽధులతో పాటు, ప్రముఖ పత్రికల నుంచి ఎ.రంగారావు(ఈనాడు), అమెర్ అలీఖాన్(సియాసత్), ఎన్.శ్రీనివా్‌సరెడ్డి(దిశ), బైసా రమాదేవి(పొద్దు)లకు చోటు కల్పించింది. ఎలకా్ట్రనిక్ మీడియా నుంచి మురళీకృష్ణ(వీ6), ఫొటో జర్నలిస్టుల తరపున బీహెచ్‌కే గాంధీ(డెక్కన్ క్రానికల్), వీడియో జర్నలిస్టుల నుంచి టి.నాగేశ్వరరావు(బిగ్ టీవీ), డెస్క్ జర్నలిస్టుల నుంచి బి.శ్రీనివాసరావు(ఆంధ్రజ్యోతి)లు సభ్యులుగా ఉంటారు. మహిళా కోటాలో ఎలకా్ట్రనిక్ మీడియా నుంచి రాధిక(ఎన్‌టీవీ), ప్రింట్ మీడియా నుంచి స్వాతి వడ్లమూడి(ది హిందు)లను నియమించింది. వీరితో పాటు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, టీఎ్‌సఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే, సమాచార పౌర సంబంధాల శాఖ చీఫ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూడా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు.