Share News

సీఎస్‌ సారథ్యంలో మెట్రోరైల్‌ బోర్డు

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:23 AM

ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు టేకోవర్‌ ప్రక్రియ చివరి దశకు చేరింది. మే 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో...

సీఎస్‌ సారథ్యంలో మెట్రోరైల్‌ బోర్డు

  • ‘ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌’ ఏర్పాటు..చైర్మన్‌గా రామకృష్ణారావు నియామకం

  • డైరెక్టర్లుగా మరో 8 మంది ఐఏఎస్‌లు, 1 ఐపీఎస్‌.. 30లోగా స్వాధీన ప్రక్రియ పూర్తి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌అండ్‌టీ నుంచి మెట్రో మొదటి దశ ప్రాజెక్టు టేకోవర్‌ ప్రక్రియ చివరి దశకు చేరింది. మే 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైళ్లను నడిపించడమే లక్ష్యంగా అధికారులు ముందుకుసాగుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సారథ్యంలో ‘ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌’ (ఎంఆర్‌హెచ్‌ఎల్‌) బోర్డు ఏర్పాటైంది. దీనికి సంబంధించిన జీవో 128 శనివారం విడుదలైంది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ బోర్డుకు ఎండీగా వ్యవహరించనున్నారు. వివిధ విభాగాలకు చెందిన మరో 9 మంది ఐఏఎస్‌లు, 1 ఐఏఎస్‌ను బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. రూ.15 వేల కోట్ల వ్యయంతో ఎల్‌అండ్‌టీ నుంచి 100 శాతం ఈక్విటీ సేకరణకు ఇప్పటికే జీవోలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సదరు లావాదేవీలు ఈనెల 30తో ముగియనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 04:23 AM