రెవెన్యూలో మహిళల రక్షణకు ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’
ABN , Publish Date - May 05 , 2026 | 03:49 AM
రెవెన్యూ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై జరిగే లైంగిక వేధింపులను కట్టడి చేయడమే లక్ష్యంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ కార్యదర్శి లోకేష్ సోమవారం ...
హైదరాబాద్, మే 4 (ఆంధ్ర జ్యోతి): రెవెన్యూ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులపై జరిగే లైంగిక వేధింపులను కట్టడి చేయడమే లక్ష్యంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ కార్యదర్శి లోకేష్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఎల్‌ఎల్‌వీ సుబ్బమ్మ కమిటీ అధ్యక్షురాలిగా.. సంయుక్త కార్యదర్శి జె.వి. విజయలక్ష్మి, సెక్షన్ అధికారిణి ఎ. ఉమారెడ్డి, ఏఎస్వో నివేదిత సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీ ఫిర్యాదులను స్వీకరించి, విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. నివేదిక ఆధారంగా సదరు అధికారులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది.