Share News

వీబీజీ రాంజీపై ఇతర రాష్ట్రాలకు క్యాబినెట్‌ సబ్‌కమిటీ

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:37 AM

వీబీజీ-రాంజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం ద్వారా పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని.. రాష్ట్రాలపై ఆర్థిక, పరిపాలనా ...

వీబీజీ రాంజీపై ఇతర రాష్ట్రాలకు క్యాబినెట్‌ సబ్‌కమిటీ

  • ఆ తర్వాతే విధి విధానాలు: సీతక్క

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వీబీజీ-రాంజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విధానం ద్వారా పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని.. రాష్ట్రాలపై ఆర్థిక, పరిపాలనా పరమైన భారం కూడా పడుతుందని మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విధానం వీబీజీ-రాంజీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసినప్పటికీ, జూలై 1 నుంచి అమలు చేయాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావడం బాధాకరమన్నారు. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌, తుమ్మల, వివేక్‌, తాను సభ్యులుగా ఉన్న ఈ కమిటీ వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, చర్చలు జరిపి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 03:37 AM