Share News

‘చేపల చెరువుల’పై ఏం చేద్దాం?

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:49 AM

చెరువులు తవ్వకుండానే, చేపలు పెంచకుండానే రికార్డుల్లో లెక్కలు చూపించి కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకుంటున్నాయి.

‘చేపల చెరువుల’పై ఏం చేద్దాం?

  • అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్స్యశాఖ అధికారి తర్జనభర్జన!

  • సీనియర్‌ ఐఏఎస్‌తో సమావేశం

  • జిల్లాల నుంచి వివరాల సేకరణకు నిర్ణయం

  • త్వరలోనే తేలనున్న చెరువులు.. చేపల లెక్క!

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): చెరువులు తవ్వకుండానే, చేపలు పెంచకుండానే రికార్డుల్లో లెక్కలు చూపించి కోట్లాది రూపాయలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఆసక్తికర పరిణామా లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్స్యశాఖలోని అధికారి శనివారం ఉద యం సచివాలయంలో ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మరోశాఖలో ఉన్న సదరు సీనియ ర్‌ ఐఏఎస్‌ అధికారికి.. గతంలో మత్స్యశాఖ వ్యవహారాలు చూసిన సమయంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడా ఇద్దరు అధికారులు సుమారు గంటన్నరపాటు సమావేశమయ్యారని.. ఏం చేయాలనే దానిపై చర్చించుకుని ఉంటారని మత్స్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.


సమగ్ర విచారణకు అధికారులు సిద్ధం

చేపల చెరువులు తవ్వకుండానే కాగితాలపై రికార్డులు సృష్టించి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వైనంపె ‘చెరువులూ లేవు.. చేపలూ లేవు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ శనివారం ప్రచురించిన కథనంతో ప్ర భుత్వం స్పందించింది. సదరు శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ప్రధానమంత్రి మత్స్య సం పద యోజన(పీఎం-ఎంఎస్‌వై) పథకంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణకు రంగం సిద్ధంచేసినట్టు తెలిసింది. ఇందుకోసం జిల్లాల నుంచి చేపల చెరువులు, చేపపిల్లల సరఫరా సబ్సిడీకి సంబంధించిన రికార్డుల్ని సేకరిస్తున్నట్టు సమాచారం. సోమవా రం నాటికి ప్రాథమిక నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉందని.. దానిఆధారంగా పూర్తిస్థాయి విచారణ చేప ట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని మత్స్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారుల పేర్లు ప్రధానంగా వినిపిస్తుండటంతో వారిని విచారించాలని భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Aug 23 , 2026 | 05:51 AM