Share News

అగ్నిమాపక శాఖ చట్ట సవరణ ముసాయిదా సిద్ధం

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:20 AM

అగ్నిప్రమాదాల నివారణ, ప్రాణ రక్షణ చర్యల్ని మరింత మెరుగుపరిచేందుకు అగ్నిమాపక శాఖ చట్టం-1999 సవరణ ముసాయిదా సిద్ధమైంది..

అగ్నిమాపక శాఖ చట్ట సవరణ ముసాయిదా సిద్ధం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): అగ్నిప్రమాదాల నివారణ, ప్రాణ రక్షణ చర్యల్ని మరింత మెరుగుపరిచేందుకు అగ్నిమాపక శాఖ చట్టం-1999 సవరణ ముసాయిదా సిద్ధమైంది. అగ్నిమాపక శాఖ ఎన్‌ఓసీ జారీ విధానాలు సరళీకరించడం, నియంత్రణ, ప్రస్తుతం అనుమతి పొందుతున్న భవనాల ఎత్తు తగ్గింపు, ప్రజల భద్రతకు ఆధునిక అవసరాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి తదితర కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. పారదర్శకత, ప్రజా భాగస్వామ్య విధానంలో భాగంగా ఈ సవరణల ముసాయిదాను సంబంధిత వర్గాలు, సాధారణ ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోరుతూ ప్రజా డొమైన్‌లో ఉంచారు. ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను వెబ్‌సైట్‌తోపాటు actamendfired@telangana.gov.in కు ఈ-మెయిల్‌ చేయొచ్చని, కార్యాలయ చిరునామాకు లేఖలైనా పంపొచ్చని పేర్కొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 05:20 AM