Share News

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ను రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం

ABN , Publish Date - May 02 , 2026 | 05:23 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడవడానికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 7ను జారీ చేసిందని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు.

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ను రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం

  • రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు : జాజుల

బర్కత్‌పుర, మే 1 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి తూట్లు పొడవడానికే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 7ను జారీ చేసిందని బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆ జీవోపై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. జీవో 7ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 3న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఆ జీవో ప్రతులను దహనం చేయనున్నట్లు తెలిపారు. జూన్‌ మొదటి వారంలో లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్‌ దిగ్బంధం చేయనున్నట్లు ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్పంచ్‌లకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా, తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ రాష్ట్ర కార్యనిర్వాహకఅధ్యక్షుడిగా యతీశ్వర్‌గౌడ్‌ నియమితులయ్యారు.

Updated Date - May 02 , 2026 | 05:23 AM