Share News

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’పై రెండు మూడు రోజుల్లో సమావేశం: భట్టి

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:57 AM

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఫీజు బకాయిలపై....

‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’పై రెండు మూడు రోజుల్లో సమావేశం: భట్టి

  • రూ.8000 కోట్ల బకాయిలు చెల్లించాలి: జాజుల

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఫీజు బకాయిలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారులతో రెండు మూడు రోజుల్లోనే సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. అంతకుముందు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మంగళవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిసి ఫీజు బకాయిలు, బీసీల ఇతర డిమాండ్లపై వినతిపత్రాన్ని ఇచ్చారు. 14 లక్షల మంది పేద విద్యార్థులకు రూ.8వేల కోట్ల ఫీజు బకాయిలను నాలుగేళ్లుగా చెల్లించడం లేదని, వీటిని వెంటనే అందివ్వాలని ఆయన కోరారు.

Updated Date - Jun 24 , 2026 | 03:57 AM