Share News

శివయ్యా.. గంగను విడవయ్యా..!

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:12 AM

గంగమ్మను తలపై బంధించిన శివయ్యా.. కరుణించి ఆ గంగను విడిచి వానలు కురిపించు’’ అంటూ రైతులు శివలింగాన్ని జలదిగ్బంధం చేశారు.

శివయ్యా.. గంగను విడవయ్యా..!

  • వర్షాలు కురవాలని జలదిగ్బంధం, కప్పతల్లి ఆటలు, శివాలయంలో పూజలు

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ‘‘గంగమ్మను తలపై బంధించిన శివయ్యా.. కరుణించి ఆ గంగను విడిచి వానలు కురిపించు’’ అంటూ రైతులు శివలింగాన్ని జలదిగ్బంధం చేశారు. సకాలంలో వర్షాలు కురువాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శివాలయంలో రైతులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి ప్రధాన ద్వారం వద్ద మట్టితో ఎత్తుగా కట్ట కట్టి, గర్భగుడిలోకి నీటిని పంపి శివలింగాన్ని పూర్తిగా జలదిగ్బంధం చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కర్రకు కప్పను కట్టి ‘కప్పతల్లి ఆటలు’ ఆడారు. ‘‘వానాలు కురవాలి వానదేవుడా.. వరి చేలు పండాలి వానదేవుడా..’’ అంటూ పాడుతూ వర్షం కోసం వేడుకున్నారు.

Updated Date - Jun 23 , 2026 | 03:12 AM