నిషేధిత హెచ్‌టీ కాటన్, గ్లైఫోసెట్‌ను వాడొద్దు: కోదండరెడ్డి
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:28 AM
దేశంలో నిషేధిత హెచ్‌టీ కాటన్ విత్తనం, గ్లైఫోసెట్ రసాయనాలు మార్కెట్లోకి వస్తున్నాయని, ఆ గడ్డి మందు, విత్తనాలను రైతులు వాడొద్దని రైతు...
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): దేశంలో నిషేధిత హెచ్‌టీ కాటన్ విత్తనం, గ్లైఫోసెట్ రసాయనాలు మార్కెట్లోకి వస్తున్నాయని, ఆ గడ్డి మందు, విత్తనాలను రైతులు వాడొద్దని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమాయక రైతులను మోసం చేసి విత్తన కంపెనీలు, డీలర్లు అమ్ముతున్న విషయం కమిషన్ దృష్టికి వచ్చినట్లు వ్యవసాయ అధికారులకు తెలిపారు. సోమవారం బీఆర్కే భవన్‌లోని రైతు కమిషన్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. హెచ్‌టీ కాటన్, గ్లైఫోసెట్ పురుగు మందు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వస్తున్నట్లు అధికారులు కమిషన్ దృష్టికి తెచ్చారు.