Share News

తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:24 AM

దేశ ఆదాయానికి వెన్నెముకగా నిలుస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో ఆర్థిక వివక్ష చూపుతోందని, ఇది సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ నుంచి లక్షల కోట్లను పన్నుల రూపంలో తీసుకెళ్తున్న కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇచ్చేది గోరంత..

తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష

  • ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత: తుమ్మల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): దేశ ఆదాయానికి వెన్నెముకగా నిలుస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో ఆర్థిక వివక్ష చూపుతోందని, ఇది సమాఖ్య వ్యవస్థపై జరుగుతున్న దాడి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ నుంచి లక్షల కోట్లను పన్నుల రూపంలో తీసుకెళ్తున్న కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని, ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత అని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 2018-2023 మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి రూ.22.86 లక్షల కోట్ల పన్నులు వసూలు చేసిన కేంద్రం.. తిరిగి ఇచ్చింది కేవలం 16.3శాతం మాత్రమేనని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు చెల్లించే ప్రతి రూపాయికి 30పైసలు వెనక్కి వస్తుంటే.. ఉత్తరాది రాష్ట్రాలకు ప్రతి రూపాయికి రూ.4 చొప్పున ఇస్తున్నారని తెలిపారు. ఎక్కువ పన్నులు చెల్లించే రాష్ట్రాలను శిక్షించడం వికసిత్‌ భారత్‌ లక్షణమా? అని ప్రశ్నించారు. 2024-25లో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.1,33,208 కోట్లు ఇవ్వగా.. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, పథకాలు అన్నీ కలిపి కేవలం రూ.51,725 కోట్లు మాత్రమే రాష్ట్రానికి విడుదల చేశారని, ఇదే విషయాన్ని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి సమాధానమిచ్చారని వెల్లడించారు. తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపకపోవడం వారి పతనానికి నాంది అని అన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 02:24 AM