Share News

రైతుభరోసా నమోదుకు 25 వరకు గడువు

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:40 AM

రైతు భరోసా పథకంలో కొత్త రైతుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈమేరకు ఈ నెల 16 తేదీ నుంచే పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది.

రైతుభరోసా నమోదుకు 25 వరకు గడువు

  • ఫిబ్రవరి 28 నాటికి పాస్‌బుక్‌ వచ్చిన వారికే చాన్స్‌

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా పథకంలో కొత్త రైతుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈమేరకు ఈ నెల 16 తేదీ నుంచే పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈనెల 25వ తేదీ వరకు కొత్త రైతుల నమోదు ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 28 తేదీ నాటికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అయిన రైతులు మాత్రమే రైతుభరోసా పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మార్చి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ చేసిన రైతులకు అవకాశం ఉండదు. వీరికి వచ్చే సీజన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకంలో నమోదు చేసుకోని రైతులు, బ్యాంకు వివరాలు నమోదు చేయని రైతులు కూడా ఇప్పుడు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. రైతువేదికల్లో ఏఈవోలు అందుబాటులో ఉంటారని, వారికి పూర్తి వివరాలివ్వాలని వ్యవసాయశాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.

Updated Date - Mar 18 , 2026 | 05:40 AM