200 గజాల స్థలం ఉంటే ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రం
ABN , Publish Date - May 02 , 2026 | 05:49 AM
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద జాతీయ, రాష్ట్ర హైవేలపై ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు పెట్టుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరించుకునే గడువును తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ...
పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 80 శాతం సబ్సిడీ
ఈనెల 7 దాకా గడువు పొడిగించిన తెలంగాణ రెడ్‌కో
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద జాతీయ, రాష్ట్ర హైవేలపై ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు పెట్టుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరించుకునే గడువును తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (తెలంగాణ రెడ్‌కో) పొడిగించింది. ఇప్పటిదాకా ఈనెల 3 దాకా గడువు ఉండగా... దాన్ని 7వ తేదీ దాకా పొడిగించింది. ఆసక్తి కలిగిన భూ యాజమానులు, వాణిజ్య సంస్థలు ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలు పెట్టుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని కోరింది. హైదరాబాద్‌తో పాటు గ్రేటర్ వరంగల్, పటాన్‌చెరు, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై కనీసం 200 గజాల స్థలాలు కలిగిన వారు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మరిన్ని వివరాలకు, దరఖాస్తులను సమర్పించడానికి www.tgredco. telangana.gov.in/EMobility/PMEDrive లో లేదా 63049 03957, 63049 03935 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది. ఎలక్ట్రిక్ కేంద్రాలు పెట్టుకున్న వారికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ విడుదల అవుతుందని పేర్కొంది. ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రానికి అయ్యే వ్యయంలో 80 శాతం మేర సబ్సిడీగా పొందే అవకాశం ఉంటుందని వివరించింది.