Share News

ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు 2 నెలల గడువు

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:19 AM

కొత్త వాహనాలు (కారు, బైక్‌) కొనుగోలు చేసే వారికి రవాణా శాఖ కొంత ఊరటనిచ్చింది. తమ వాహనాలకు నచ్చిన ఫ్యాన్సీ లేదా ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్లను...

ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు 2 నెలల గడువు

  • టీఆర్‌ గడువు పెంచుతూ రవాణా శాఖ నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కొత్త వాహనాలు (కారు, బైక్‌) కొనుగోలు చేసే వారికి రవాణా శాఖ కొంత ఊరటనిచ్చింది. తమ వాహనాలకు నచ్చిన ఫ్యాన్సీ లేదా ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్లను ఎంచుకోవడానికి ఇకపై రెండు నెలల గుడువు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘వాహన్‌’ సాఫ్ట్‌వేర్‌ నిబంధనల ప్రకారం.. కొత్త వాహనం కొన్నప్పుడు ఇచ్చే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (టీఆర్‌) గడువు నెల రోజులు మాత్రమే ఉంటుంది. కానీ, వాహనదారుల సౌకర్యం కోసం ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ నంబర్లను రిజర్వు చేసుకునే గడువును టీఆర్‌ జారీ చేసిన తేదీ నుంచి రెండు నెలల వరకు పొడగిస్తూ రవాణా శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు నెలల గడువు లోపు గనుక వాహనదారులు తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబరును రిజర్వు చేసుకోకపోతే, వాహన్‌ సాఫ్ట్‌వేర్‌ ఆటోమెటిక్‌గా ఏదో ఒక సాధారణ నంబరును కేటాయించేస్తుందని అధికారులు వెల్లడించారు.

Updated Date - Jun 11 , 2026 | 04:19 AM