Share News

మాజీ సైనికుల సంక్షేమానికి చర్యలు: సీవీ ఆనంద్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:16 AM

మాజీ సైనికుల సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని, తెలంగాణ ఎక్స్‌ సర్వీస్‌మెన్ కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని...

మాజీ సైనికుల సంక్షేమానికి చర్యలు: సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : మాజీ సైనికుల సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని, తెలంగాణ ఎక్స్‌ సర్వీస్‌మెన్ కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. పంజాగుట్టలో ఉన్న సైనిక సంక్షేమ విభాగం ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించి మరింత శుభ్రత పాటించాలనిసూచనలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్‌ ప్రణాళికలపై కొత్త డైరెక్టర్‌ ఎ.ఆర్‌. రావు ఈ సందర్భంగా ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘‘మన సైనికులు’’ వెబ్‌సైట్‌లో సుమారు 40,000 మంది మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యుల వివరాలు నమోదయ్యాయని... రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల నుంచి నగదు గ్రాంట్లు మాత్రమే కాకుండా, గృహ నిర్మాణం, విద్య, ఉపాధి వంటి అనేక సంక్షేమ పథకాలు వీరికి అందుబాటులో ఉన్నాయని ఆనంద్‌ వివరించారు.

Updated Date - Apr 28 , 2026 | 07:17 AM