బాంబుల మోత మధ్యలోనూ బోనమెత్తారు
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:36 AM
ఇరాన్ క్షిపణి దాడులతో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న బహ్రెయిన్‌లోని తెలుగు ప్రజలు బోనాల పండుగ చేసుకున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో...
బహ్రెయిన్‌లో సందడిగా బోనాల పండుగ
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇరాన్ క్షిపణి దాడులతో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న బహ్రెయిన్‌లోని తెలుగు ప్రజలు బోనాల పండుగ చేసుకున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భయం గుప్పిట జీవిస్తున్నప్పటికీ.. సమాజ శాంతి, సుభిక్షతను కోరుకుంటా మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. తెలుగు కళా సమితి అధ్వర్యంలో బహ్రెయిన్‌లో శుక్రవారం నిర్వహించిన బోనాల పండుగలో తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత రాయబారి వినోద్ జాకబ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోతరాజుల ప్రదర్శన, బోనాల ఊరేగింపు ఆకట్టుకున్నాయి. పోతరాజు పాత్ర వేసిన ప్రతిసారి తనకు హైదరాబాద్‌లోని మహంకాళి అమ్మవారి ఎదుట ఉన్న అనుభూతి కలుగుతుందని హైదరాబాద్‌కు చెందిన శ్రీరామ్ చెప్పారు. తన తాత పోతరాజు పాత్రదారులను అలంకరించిన తీరును చిన్నతనంలో గమనించాని, ఇప్పుడు బహ్రెయిన్‌లో పోతరాజులను అలాగే అలంకరిస్తున్నానని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన అక్షయ అన్నారు.