Share News

రాష్ట్రంలో విస్తృతంగా మహిళా సమాఖ్యల పెట్రోల్‌ బంకులు:సీతక్క

ABN , Publish Date - May 19 , 2026 | 05:10 AM

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులు ఈఏపీసెట్‌-2026 ఫలితాల్లో సత్తా చాటారు.

రాష్ట్రంలో విస్తృతంగా మహిళా సమాఖ్యల పెట్రోల్‌ బంకులు:సీతక్క

హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చేపట్టిన మహిళా సమాఖ్యల పెట్రోల్‌ బంకుల ఏర్పాటు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టినట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్‌లోని హకీంపేట గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు నిర్మాణ పనులు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 39 ప్రాంతాల్లో మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని, ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థల సహకారంతో భూముల గుర్తింపు, లీజు ఒప్పందాలు, ఎన్‌వోసీలు, లేఅవుట్లు, అడ్వాన్స్‌ పొజిషన్‌, ట్యాంకుల ఇన్‌స్టలేషన్‌ వంటి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి.. అధిక సంఖ్యలో మహిళా సమాఖ్యల పెట్రోల్‌ బంకులు ప్రారంభించేందుకు అధికారులుదృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.

Updated Date - May 19 , 2026 | 05:10 AM