Share News

బీఆర్‌ఎస్‌ హయాంలోనే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు: జూపల్లి

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:47 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు: జూపల్లి

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగాయని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. విచ్చలవిడి మద్యం విక్రయాలు పెంచారని బీఆర్‌ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యపై మంత్రి జూపల్లి స్పందిస్తూ.. తెలంగాణ ఏర్పాటైనప్పుడు రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా రూ.9000 కోట్ల ఆదాయం లభిస్తే, 2023లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టే నాటికి ఎక్సైజ్‌శాఖ ఆదాయం రూ.35 కోట్లకు పెరిగిందన్నారు. గత రెండేళ్లలో తమ ప్రభుత్వం ఎటువంటి పన్నులు పెంచలేదని చెప్పారు. 2025-27 మధ్య కొత్త మద్యం పాలసీతో దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి సుమారు రూ.2,800 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు.

Updated Date - Mar 24 , 2026 | 05:47 AM