Share News

సెలవుల్లోనూ కొత్తబార్ల దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:35 AM

సెలవు రోజుల్లోనూ కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది.

సెలవుల్లోనూ కొత్తబార్ల దరఖాస్తుల స్వీకరణ
bar

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): సెలవు రోజుల్లోనూ కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ప్రకటించింది. 41 బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తుల స్వీకరణ కాలంలో 2 రోజులు సెలవులు వస్తున్నాయన్న దరఖాస్తు దారుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 10 (రెండో శనివారం), 11 తేదీ (ఆదివారం)ల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. శుభ ముహూర్తాలు గల 9, 11, 12 తేదీల్లో దరఖాస్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తదనుగుణంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యూర్‌ పరిధిలోని 14 బార్లతోపాటు మిగతా 27 బార్ల కోసం కూడా సెలవు రోజుల్లోనూ దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Oct 09 , 2026 | 06:35 AM