ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:06 AM
ఎక్సైజ్ శాఖలో సర్కారు భారీగా బదిలీలు చేపట్టింది. 14 మంది డి ప్యూటీ కమిషనర్లు, 19 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 35 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లకు....
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో సర్కారు భారీగా బదిలీలు చేపట్టింది. 14 మంది డి ప్యూటీ కమిషనర్లు, 19 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 35 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లకు స్థానచలనం కల్పిస్తూ ఆ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక కమిషనర్ చెవ్వూరు హరికిరణ్‌తో వివాదంలో ఇరుక్కున్న నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ వి.సోమిరెడ్డిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. బదిలీ అయిన వారంతా తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్సైజ్ శాఖలో ఆరేళ్లుగా జటిలంగా ఉన్న సమస్యను పరిష్కరించడంతో పాటు పునర్విభజన ప్రక్రియను ప్రాధాన్య అంశంగా తీసుకుని.. బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్యోగుల పక్షాన ఎక్సైజ్ ఉద్యోగుల సంఘం ధన్యవాదాలు తెలిపింది.