Share News

నేటి నుంచే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:19 AM

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫస్టియర్‌ ప్రవేశాలకు శుక్రవారం నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

నేటి నుంచే ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఫస్టియర్‌ ప్రవేశాలకు శుక్రవారం నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎప్‌సెట్‌- 2026లో ర్యాం కులు పొందిన అభ్యర్థులు శుక్రవారం నుంచి ఈ నెల 28వరకు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 2 నుంచి 29 వరకు ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఉంటుంది. జూన్‌ 25 నుంచి జూలై 1వరకు వెబ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. మాక్‌ సీట్ల కేటాయింపు జూలై 4న ఉం టుంది. అలాట్‌మెంట్‌ నచ్చని వారు జూలై 5 నుంచి 7లోగా ఆప్షన్లను మార్చుకునే అవకాశం కల్పించారు. జూలై 10లోగా తొలిదశ సీట్ల కేటాయింపులను ప్రకటించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 14లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలని సాంకేతిక విద్యామండలి అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 03:19 AM