పీఆర్సీ నివేదికలో జాప్యం వద్దు: ఉద్యోగుల సంఘం
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:38 AM
పీఆర్‌సీ నివేదికను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు రాసిన...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్ర జ్యోతి): పీఆర్‌సీ నివేదికను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు రాసిన లేఖలో ఐకాస ఛైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో పీఆర్సీ ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను వెంటనే బయట పెట్టాలని కోరారు. పీఆర్సీ సిఫార్సులు 2024 ఏప్రిల్ నాటికే రావాల్సి ఉన్నా జాప్యం వల్ల ఉద్యోగులు తమ హక్కులను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు.