కరెంట్ చార్జీల్లో పెంపు లేదు
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:40 AM
విద్యుత్ వినియోగదారులకు ఊరట. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026-27)లో ప్రస్తుతం అమల్లో ఉన్న కరెంట్ చార్జీలే అమలుకానున్నాయి.
2026-27లో పాత చార్జీలకే టీజీఈఆర్‌సీ ఆమోదం
హైదరాబాద్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారులకు ఊరట. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026-27)లో ప్రస్తుతం అమల్లో ఉన్న కరెంట్ చార్జీలే అమలుకానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ బిల్లులు పెంచవద్దని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) సోమవారం ఈమేరకు టారిఫ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. డిస్కమ్‌లు పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 2026-27 ఆర్థిక సంవత్సరంలో పాత కరెంట్ చార్జీల వసూలుకే పరిమితం కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీఎ్‌సఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావులు టారిఫ్ ఉత్తర్వులు విడుదల చేశారు.