Share News

తప్పుడు కరెంట్‌ బిల్లులను వారంలోపు సరిచేయాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:21 AM

విద్యుత్‌ వినియోగదారుడికి తప్పుల తడకగా కరెంట్‌ బిల్లు జారీ అయితే... దానిని వారం రోజుల్లోపు సరిచేయాలని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి...

తప్పుడు కరెంట్‌ బిల్లులను వారంలోపు సరిచేయాలి

  • వినియోగదారులు అధికంగా చెల్లిస్తే... 18 శాతం వార్షిక వడ్డీతో సర్దుబాటు: ఈఆర్‌సీ

విద్యుత్‌ వినియోగదారుడికి తప్పుల తడకగా కరెంట్‌ బిల్లు జారీ అయితే... దానిని వారం రోజుల్లోపు సరిచేయాలని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుడు అదనంగా చెల్లింపులు చేసి ఉంటే... తదుపరి బిల్లుల్లో ఆ మొత్తాన్ని 18 శాతం వార్షిక వడ్డీతో సర్దుబాటు చేయాలని నిర్దేశించింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ సప్లై కోడ్‌ రెగ్యులేషన్స్‌-2026లో మూడో సవరణ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా వినియోగదారుడు తప్పు చేస్తే 18 శాతం, అదే విద్యుత్‌ సంస్థలు తప్పు చేస్తే 24 శాతం వార్షిక వడ్డీతో బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ఉండగా... విద్యుత్‌ సంస్థల విజ్ఙప్తితో ఇరువర్గాలకు 18 శాతం వార్షిక వడ్డీయే అమలు కానుంది.

Updated Date - Apr 14 , 2026 | 05:21 AM