Share News

ఏప్రిల్‌ 8 నుంచి విద్యుత్‌ ఆర్టిజన్ల నిరవధిక సమ్మె

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:23 AM

తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఆర్టిజన్ల జేఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్‌ 8 నుంచి విద్యుత్‌ ఆర్టిజన్ల నిరవధిక సమ్మె

  • సీఎండీలకు సమ్మె నోటీసులు అందజేత

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఆర్టిజన్ల జేఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టిజన్ల జేఏసీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సీఎండీలకు పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె నోటీసులు అందజేశారు. సమ్మెకు వెళ్లే ముందు దశలవారీగా నిరసనలు తెలపాలని జేఏసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్త ధర్నాలు, ఏప్రిల్‌ 2న వంటా-వార్పు, ఏప్రిల్‌ 7న ఉత్తర డిస్కం కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టనున్నారు. ఆ లోపు యాజమాన్యం స్పందిచకపోతే ఏప్రిల్‌ 8 నుంచి విధులను బహిష్కరిస్తామని జేఏసీ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Mar 18 , 2026 | 05:23 AM