Share News

రేపు విద్యాసంస్థల బంద్‌: ఐక్యవేదిక

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:20 AM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.

రేపు విద్యాసంస్థల బంద్‌: ఐక్యవేదిక

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాల ఐక్య వేదిక విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. 24న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్‌, ఎస్‌ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ సంఘాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, సహకరించచాలని కోరాయి. దేశ విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సంఘాల ప్రతినిధులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌, టి.నాగరాజు, వెంకటస్వామి, పల్లె మురళి డిమాండ్‌ చేశారు.

Updated Date - Jul 23 , 2026 | 06:20 AM