Share News

గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఇవే

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:44 AM

పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో.. తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పాఠశాల విద్యాశాఖ కోరింది.

గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఇవే

  • జాబితా ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో.. తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. పిల్లలను బడుల్లో చేర్పించే ముందు పాఠశాల గుర్తింపును తప్పనిసరిగా తెలుసుకోవాలని, గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చవద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు, మండలాల వారీగా గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలను విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in లో ఉంచామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 05:44 AM