భారీగా డీఈవోల బదిలీలు!
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:45 AM
రాష్ట్ర విద్యాశాఖలో జిల్లా విద్యాధికారుల(డీఈవో) స్థాయిలో భారీగా బదిలీలు, పోస్టింగ్‌లు జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. పలు జిల్లాల్లో ...
మరో జిల్లాకు మార్చడంతో పాటు..కొన్నిచోట్ల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగింత
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర విద్యాశాఖలో జిల్లా విద్యాధికారుల(డీఈవో) స్థాయిలో భారీగా బదిలీలు, పోస్టింగ్‌లు జరిగినట్లు అధికార వర్గాల సమాచారం. పలు జిల్లాల్లో పనిచేస్తున్న డీఈవోలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చడంతో పాటు కొన్నిచోట్ల ఇన్‌చార్జి బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా డీఈవోగా పనిచేస్తున్న విజయకుమారిని మహబూబ్‌నగర్ జిల్లా డీఈవోగా, వికారాబాద్ డీఈవోగా ఉన్న రేణుకను మేడ్చల్ జిల్లా డీఈవోగా, హైదరాబాద్ డీఈవోగా విధులు నిర్వహిస్తున్న రోహిణిని సంగారెడ్డి జిల్లా డీఈవోగా బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లా డీఈవోగా ఉన్న సుశీందర్‌రావును నల్గొండ జిల్లా డీఈవోగా బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లా డీఈవోగా రేవతి రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా డీఈవోగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును హైదరాబాద్ జిల్లా డీఈవోగా బదిలీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పలు జిల్లాలకు పూర్తిస్థాయి డీఈవోలు లేకపోవడంతో పలువురికి పూర్తి అదనపు(ఎఫ్ఏసీ) బాధ్యతలను అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ ఈవో వసంతికి డీఈవో(ఎఫ్ఏసీ) బాధ్యతలు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు గ్రేడ్-1 జీహెచ్‌ఎం భిక్షపతిని డీఈవో(ఎఫ్ఏసీ)గా నియమించారు. సిద్ధిపేట జిల్లాకు శాస్ర్తిని డీఈవో(ఎఫ్ఏసీ)గా నియమించారు. మెదక్ జిల్లాకు ప్రవీణ్, వికారాబాద్ జిల్లాకు అబ్దుల్ ఘనీ, వనపర్తి జిల్లాకు వెంకటేశ్వర్ రెడ్డి, కామారెడ్డి జిల్లాకు మల్లికార్జున్‌లను డీఈవో(ఎఫ్ఏసీ)లుగా నియమించినట్లు తెలిసింది. విద్యాశాఖలో పరిపాలన పునర్వ్యవస్థీకరణ, ఖాళీల భర్తీ, జిల్లాల వారీగా విద్యా పరిపాలన బలోపేతం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉత్తర్వులు వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.