Share News

తెలంగాణ ఈ-పాస్‌ గడువు 31వరకు పెంపు

ABN , Publish Date - May 26 , 2026 | 04:48 AM

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ (ఫ్రెష్‌, రెన్యూవల్‌) దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు...

తెలంగాణ ఈ-పాస్‌ గడువు 31వరకు పెంపు

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ (ఫ్రెష్‌, రెన్యూవల్‌) దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఈ గడువు ఏప్రిల్‌ 20తోనే ముగియాల్సి ఉన్నప్పటికీ, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మే 31 వరకు తుది అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఈ-పాస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

Updated Date - May 26 , 2026 | 04:48 AM