Share News

ఓటర్లకు అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:34 AM

తెలంగాణ ముసాయిదా ఓటర్ల జాబితాలో 90 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించడంపై తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ఓటర్లకు అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం

  • ‘సర్‌’ ప్రక్రియపై తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆందోళన

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముసాయిదా ఓటర్ల జాబితాలో 90 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లినట్లు గుర్తించడంపై తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సర్‌ ప్రక్రియలో ఓటర్లకు సరైన సహకారం, అవగాహన కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలమవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి వేదిక ప్రతినిధులు లేఖ రాశారు. ఓటర్ల జాబితాలో తమ అనుసంధాన వివరాలను నమోదు చేసుకునే విషయంలో ఓటర్లకు అన్ని స్థాయుల్లోని అధికారులు తగిన సహకారం అందించదని ఆరోపించింది. ఇప్పుడు నోటీసులు అందిన తర్వాత ప్రతి ఓటరుకు కనీసం 4 రోజుల సమయమివ్వాలని డిమాండ్‌ చేసింది. ఎన్నికల అధికారుల ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన వారికి కుటుంబ సభ్యుల ద్వారా ప్రాతినిధ్యం వహించే అవకాశమివ్వాలని కోరింది.

Updated Date - Aug 21 , 2026 | 06:35 AM