Share News

విద్యుత్‌ వినియోగదారుల ఫోరమ్‌లకు చైర్‌పర్సన్లు

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:02 AM

విద్యుత్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్‌) చైర్‌పర్సన్ల నియామకం కోసం తెలంగాణ ఉత్తర డిస్కమ్‌(టీజీఎన్పీడీసీఎల్‌-వరంగల్‌) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

విద్యుత్‌ వినియోగదారుల ఫోరమ్‌లకు చైర్‌పర్సన్లు

ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్‌) చైర్‌పర్సన్ల నియామకం కోసం తెలంగాణ ఉత్తర డిస్కమ్‌(టీజీఎన్పీడీసీఎల్‌-వరంగల్‌) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. సీజీఆర్‌ఎఫ్-1(వరంగల్‌), సీజీఆర్‌ఎఫ్-2(నిజామాబాద్‌) కేంద్రాలుగా చైర్‌పర్సన్లను నియమించనున్నారు. విద్యుత్‌ బిల్లుల్లో వివాదాలతో పాటు విద్యుత్‌ సరఫరా, కొత్త కనెక్షన్ల జారీలో జాప్యం, రీ కనెక్షన్‌, కేటగిరీ మార్పు, పేరు మార్పిడి, చిరునామా మార్పిడి వంటి అంశాలపై వినియోగదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి, వాటిపై విచారణ జరిపి... తీర్పులు వెలువరించాల్సి ఉంటుంది. జిల్లా జడ్జిగా లేదా జ్యుడీషియల్‌ అధికారిగా 20 ఏళ్లపాటు రాష్ట్రంలో సేవలందించిన వారు లేదా రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కనీస వయసు 55 ఏళ్లు ఉండాలి... 63 ఏళ్లు దాటరాదు. ఎంపికైన వారు మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్లు నిండేదాకా(ఏదీ ముందయితే అది) పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర డిస్కమ్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 06:02 AM