Share News

జేఎస్ఎస్‌కే డైట్‌ బిల్లులు ఇప్పించండి

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:20 AM

ప్రభుత్వ బోధనా ఆస్పత్రులు, టీవీవీపీ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లు, వైద్య సిబ్బందికి, అలాడే జనని శిశు సురక్షా కార్యక్రమం (జేఎస్ఎస్‌కే ) పథకం కింద గర్భిణులకు అందించిన ....

జేఎస్ఎస్‌కే డైట్‌ బిల్లులు ఇప్పించండి

  • మూడేళ్లుగా చెల్లింపులు లేక కాంట్రాక్టర్ల ఆవేదన

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనా ఆస్పత్రులు, టీవీవీపీ ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లు, వైద్య సిబ్బందికి, అలాడే జనని శిశు సురక్షా కార్యక్రమం (జేఎస్ఎస్‌కే ) పథకం కింద గర్భిణులకు అందించిన డైట్‌ సరఫరాకు సంబంధించిన బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ డైట్‌ కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ వెల్లడించింది. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం కలిపి రూ.7 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. బిల్లులు వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం హెల్త్‌ సెక్రటరీ, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు అసోసియేషన్‌ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Mar 10 , 2026 | 03:20 AM