గ్రేహౌండ్స్ దళాలు నిరంతర సన్నద్ధతతో ఉండాలి
ABN , Publish Date - May 15 , 2026 | 04:57 AM
మావోయిస్టు కార్యకలాపాల నిరోధంలో పేరొందిన గ్రేహౌండ్స్ బలగాలు క్రమశిక్షణ, నిరంతర సన్నద్ధతతో ప్రత్యేకతను చాటుకోవాలని...
అధికారులతో సమీక్షలో డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు కార్యకలాపాల నిరోధంలో పేరొందిన గ్రేహౌండ్స్ బలగాలు క్రమశిక్షణ, నిరంతర సన్నద్ధతతో ప్రత్యేకతను చాటుకోవాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అత్యున్నత స్థాయి పోరాట పటిమను కనబర్చాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. గురువారం ఆయన గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి.. ఆపరేషన్లు, పరిపాలనా అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత అవసరాలకు అనుగణంగా సిబ్బందికి అందిస్తున్న శిక్షణా ప్రమాణాలు, పాఠ్యాంశాలు, మాడ్యుల్స్‌లో నిరంతర ఆధునీకరణ ఉండాలన్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రేహౌండ్స్ బలగాల తగ్గింపుపైనా ఆయన సమీక్షించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే గ్రేహౌండ్స్ నుంచి 708 మంది సిబ్బందిని వారి మాతృ విభాగాలకు పంపించనున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ సిబ్బంది కృషి, అంకితభావాన్ని ఆయన అభినందించారు.